ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీయులు

Tue,November 19, 2019 09:16 PM

నాగారం : సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని అస్ట్రేలియా, భూటాన్, బంగ్లాదేష్, శ్రీలంక, అప్ఘనిస్తాన్ దేశాలతోపాటు ఢిల్లీ, కోల్‌కతా, ముంబైకి చెందిన 15మంది చరిత్రకారులు సందర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బౌద్ధ పులతత్వ అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న చరిత్రకారులు ఫణిగిరి క్షేత్రాన్ని సందర్శించారు.గుట్టపై ఉన్న మహాస్తూపాలు, చైత్యాలు, విహారగదులను పరిశీలించారు.


అనంతరం మ్యూజియంలో ఉన్న శిల్పాలు, జాతక కథలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పురావస్తుశాఖ ఏడీ మల్లునాయక్ మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో నాగార్జునసాగర్, నేలకొండపల్లిలో ఎక్కడా లేని విధంగా రెండో శతాబ్దం నాటి బుద్ధుని చరిత్రకు చెందని జాతక కథలు ఫణిగిరిలో లభించాయన్నారు. ఫణిగిరి కొండలపై 400 సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతంలో నివసించిన ఆనవాళ్లను వివరించారు.

ఫణిగిరి గుట్టను ఆనాడు ధర్మచక్రపురి అని పిలిచేవారన్నారు.2వ శతాబ్దంలో విశ్వవిద్యాలయంగా నెలకొందన్నారు. భౌద్ద క్షేత్ర విషయాలను ఆయన విదేశీయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్ శ్యాంసుందర్, ఎస్ క్రాంతిబాబు, ప్రాజెక్టు కన్సల్టెంట్ శ్రీనివాస్, విదేశీయులు లహోర, జుగియాన, అనాలసిస్, మిల్సోరిని, శివరాజ్, సిబ్బంది సోమారపు యాకయ్య, గట్టు వీరయ్య, కార్తీక్ పాల్గొన్నారు.

374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles