బస్సు డ్రైవర్ కు ఫిట్స్..50 మంది ప్రయాణికులు సేఫ్

Wed,November 6, 2019 04:19 PM


కొమ్రంభీం అసిఫాబాద్: జిల్లాలోని రెబ్బెన మండలం ఇందిరా నగర్ సమీపంలో రెప్పపాటులో పెనుప్రమాదం తప్పింది. మంచిర్యాల నుండి కాగజ్ నగర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 29 జెడ్ 0216) నడుపుతున్న డ్రైవర్ కి హఠాత్తుగా ఫిట్స్ (మూర్చ)వచ్చింది. బస్సు అదుపు తప్పి పక్కనున్న గుంతలో పడి పోయే సమయంలో డ్రైవర్ సమయ స్పూర్తితో బస్సుని అదుపులోకి తీసుకువచ్చి 50 మంది ప్రయాణికులను కాపాడాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ పరిస్థితిని గమనించి వెంటనే 108 కి ఫోన్ చేసి డ్రైవర్ ని వెంటనే హాస్పిటల్ కి పంపించారు. డిపో మేనేజర్ కి ఫోన్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వేరే బస్సును పంపాలని డిపో మేనేజర్ కి ఫోన్ లో చెప్పారు. ఫిట్స్ వచ్చినా లెక్కచేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


3878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles