రైతు ఎప్పుడూ నిజాయితీపరుడే: మంత్రి నిరంజన్‌ రెడ్డి

Wed,September 18, 2019 06:21 PM


హైదరాబాద్‌: మూడేళ్ల రికార్డు వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతుల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..కేంద్రప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఇచ్చిందేమిలేదన్నారు. రైతు ఎపుడూ నిజాయితీపరుడేనన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ప్రమాణాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రజలందరి మెరుగైన జీవనమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీటి వినియోగం తక్కువ ఉండే బిందుసేద్యం, తుంపర సేద్యం చేయడం, రసాయనిక ఎరువులను, క్రిమి సంహారక మందులను కాలక్రమేనా తగ్గిస్తూ..ఆరోగ్యవంతమైన పంటలు పండించే విధంగా మనం ముందుకుసాగాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. పాల రైతులకు ఇచ్చే సబ్సిడీ మూలంగా పశుసంపద పెరుగుతూ ఉంది. గొర్రెల పంపిణీ కార్యక్రమం వల్ల నేడు లక్షల సంఖ్యలో గొర్రెలు పెరిగాయి. వాటి ద్వారా వచ్చే ఎరువులు సేంద్రీయ పంటలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles