జలపాతంలోకి దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య

Wed,August 21, 2019 10:26 PM

elderly couple commits suicide by jumping into pochara waterfall

బోథ్, : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముక్క సుదర్శన్(70), ముక్క ప్రమీల(65) బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బోథ్ ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముక్క సుదర్శన్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం సుదర్శన్‌కు గుండెకు సంబంధించిన శస్త్రచికత్స జరిగింది. వయసు మీద పడడంతో అనారోగ్యంతో మరింత ఒత్తిడికి గురికావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్దారించారు.

పొచ్చెర జలపాతానికి చేరుకున్నారు. అక్కడ పార్కింగ్‌లో కారు నిలిపి జలపాతాన్ని చూసేందుకు వచ్చినట్లు సిబ్బందికి చెప్పారు. అయితే కొడుకులు, కూతుళ్లకు తల్లి ప్రమీల ఫోన్ చేసి తాము చనిపోతున్నట్లు చెప్పడంతో హుటా హుటిన పెద్ద కొడుకు శ్రీనివాస్ జలపాతానికి చేరుకున్నాడు. వెంటనే అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి వాకబు చేయగా కారు పార్కింగ్ చేసి ఉండడాన్ని గమనించి జలపాతం సమీపంలో వెతకగా జలపాతం ఒడ్డు వద్ద చెప్పులు, సెల్‌ఫోన్‌లను గమనించారు. అప్పటికే బోథ్ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించడంతో సీఐ వినోద్, ఎస్సై సతీశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం శవాలను వెలికి తీసి పంచనామా కోసం బోథ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం శవాలను బంధువులకు అప్పగించారు. వీరకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై వివరించారు.

1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles