పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి...

Mon,October 21, 2019 01:00 PM

హైదరాబాద్ : పోలీసు అమవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏ మాత్రం తీసిపోదన్నారు. శాంతి భద్రతల కోసం, సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలను కూడా అర్పిస్తున్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉంటారని సీఎం కొనియాడారు.

1287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles