యువతకు ఉపాధి కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Fri,October 18, 2019 05:50 PM

హైదరాబాద్: హెచ్‌ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరై అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ప్రైవేటు సెక్టార్‌లోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యువతకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

1190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles