కారు బోల్తా: యువకుడు మృతి

Wed,October 9, 2019 09:52 AM

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని తప్పించబోయి కారు బోల్తా పడటంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు వినయ్‌కిషోర్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles