తండ్రి కళ్లెదుటే పాఠశాల భవనం పైనుంచి దూకిన బాలుడు

Mon,August 19, 2019 08:19 PM

boy injured due to jump from school top

సూర్యాపేట: తండ్రి కళ్లెదుటే పాఠశాల భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మైనార్టీ పాఠశాలలో చోటుచేసుకుంది. పండుగకు ఇంటికి వెళ్లాక ఇవాళే కుమారుడిని తండ్రి పాఠశాలకు తీసుకువచ్చాడు. పాఠశాల నుంచి తాను కూడా ఇంటికి వస్తాననడంతో తండ్రి అంగీకరించలేదు. దీంతో తండ్రి సైదాబాయి ఎదుటే ఏడో తరగతి చదువుతున్న కొడుకు సమీర్ పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో బాలుడి కాలు విరగడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

2229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles