పంజాబ్‌లో తెలంగాణ యువకుడు మృతి

Mon,November 18, 2019 08:54 PM

వేములవాడ : వేములవాడ పట్టణంలోని బాల్‌నగర్‌కు చెందిన బోనం జశ్వంత్‌రెడ్డి (22) పంజాబ్ రాష్ట్రంలోని జలేందర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బంధువులు తెలిపిన ప్రకారం.. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న జశ్వంత్‌రెడ్డి స్నేహితుడి ద్విచక్రవాహనంపై జలేందర్‌కు వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బోనం సుధాకర్‌రెడ్డి, శోభారాణిలకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు పంజాబ్‌కు తరలివెళ్లారు. మృతదేహంతో మంగళవారం తిరిగి వచ్చే అవకాశం ఉందని బంధువులు పేర్కొన్నారు.

870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles