ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నవారు వీరే..

Thu,September 12, 2019 10:50 AM

balapur laddu special for telangana

హైదరాబాద్ : ఎంతో ప్రత్యేకత సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఇవాళ మొత్తం 19 మంది భక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు కూడా వేలం పాటలో పాల్గొనడం విశేషం. 1980 నుంచి బాలాపూర్ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. 1994లో వేలంపాట పెట్టగా నాడు రూ.450 పలికింది. 2019 నాటికి అది రూ.17.60 లక్షలకు చేరింది. క్రమంగా లడ్డూ వేలంలో విలువ పెరుగుతూ వస్తుందే కానీ తగ్గిన దాఖలాలు లేవు. వేలంపాటను ఉత్సవ కమిటీ చేపడుతుంది. పోటీదారులు ఎంతమంది పాల్గొంటారో వారి జాబితా తయారుచేసి వేలం ప్రారంభిస్తారు.

ఇప్పటి వరకు లడ్డూ దక్కించుకున్నారు..
1994 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 450
1995 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 4500
1996 కొలన్ కృష్ణారెడ్డి రూ.18,000
1996 కొలన్ కృష్ణారెడ్డి రూ.28,000
1998 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 51,000
1999 కళ్ళెం ప్రతాప రెడ్డి రూ. 65,000
2000 కళ్ళెం అంజిరెడ్డి రూ. 66,000
2001 జి.రఘునందనా చారి రూ.85,000
2002 కందాడ మాధవరెడ్డి రూ. 1.05 లక్షలు
2003 చిగిరింత బాల్‌రెడ్డి రూ. 1.55 లక్షలు
2004 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 2.01 లక్షలు
2005 ఇబ్రాం శేఖర్ రూ. 2.08 లక్షలు
2006 చిగిరింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు
2007 రఘునందనా చారి రూ. 4.15 లక్షలు
2008 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 5.07 లక్షలు
2009 సరిత రూ. 5.10 లక్షలు
2010 శ్రీధర్ బాబు రూ. 5.30 లక్షలు
2011 కొలన్ ఫ్యామిలీ రూ. 5.40 లక్షలు
2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ. 7.50 లక్షలు
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలు
2014 జైహింద్‌రెడ్డి రూ. 10 లక్షలు
2015 కళ్ళెం మదన్‌మోహన్‌రెడ్డి రూ. 10.32 లక్షలు
2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14.65 లక్షలు
2017 నాగం తిరుపతిరెడ్డి రూ.15.60 లక్షలు
2018 శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 లక్షలు
2019 కొలన్ రాంరెడ్డి రూ. 17.60 లక్షలు

3429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles