డిసెంబర్ 15 నుంచి అతిరుద్ర మహా యాగం

Sat,November 16, 2019 08:46 PM

రెడ్డికాలనీ(వరంగల్): వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో వచ్చే నెల 15 నుంచి 21వ తేదీ వరకు అతిరుద్ర మహా యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భవితశ్రీ చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపెల్లి శ్రీనివాస్, ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, వేద పండితులు విరివింటి ఫణి శశాంక్‌శర్మ, వ్యాసోజుల గోపికృష్ణశర్మ ఆధ్వర్యంలో శనివారం వేయిస్తంభాల ఆలయంలో భూమి పూజ చేశారు. యాగానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా సవ్యంగా జరిగేలా పూజలు నిర్వహించినట్లు యాగ నిర్వాహకులు తెలిపారు. లోకకళ్యాణార్థం అతి రుద్రయాగాన్ని కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠం నుంచి వేదపండితులు, రుద్రేశ్వర ఆలయ అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపారాయణదారు గంగు మణికంఠశర్మ, పరిచారకులు సందీప్‌శర్మ పాల్గొన్నారు.

957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles