మైనార్టీ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు

Thu,August 22, 2019 06:11 AM

application for minority scholarships

హైదరాబాద్ : 2019-20 విద్యా సంవత్సరానికి గాను జాతీయ మైనార్టీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌మెట్రిక్, ప్రీ -మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు http:// schlorships.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు లాగిన్ అయ్యి, ఆన్‌లైన్‌లో ఆమోదించి, తదుపరి ప్రింట్‌తీసి ఆయా ప్రతులను మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. తమ కార్యాలయంలో సంప్రదిస్తే విద్యా సంస్థలకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను జారీ చేస్తామని, జిల్లాలోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు, విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో సమర్పించడానికి ముఖ్యమైన తేదీలు ఈ విధంగా ఉన్నాయి.
ముఖ్యమైనవి విద్యార్థులు ఆన్‌లైన్‌లో విద్యాసంస్థలు సమర్పించడానికి
ప్రీ -మెట్రిక్ 15-10-19 31-10-19
పోస్ట్ మెట్రిక్ 31-10-19 15-11-19
మెరిట్ కమ్ మీన్స్ 31-10-19 15-11-19

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles