ఈఎస్‌ఐ కుంభకోణం నిందితులకు ఏసీబీ కస్టడీ

Wed,October 9, 2019 10:46 AM

హైదరాబాద్‌: ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో నిందితులకు ఏసీబీ కోర్టు కస్టడీ విధించింది. నిందితులు దేవికారాణి, పద్మజ, వసంత, ఇందిరా, రాధిక, ఫార్మా కంపెనీ ప్రతినిధులు శ్రీహరి, నాగరాజు, హర్షవర్ధన్‌లు ఏసీబీ కస్టడీలో ఉండనున్నారు. రెండు రోజుల పాటు ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. కస్టడీలోని ఏడుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.


డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను ఏసీబీ అధికారులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల వాంగ్మూలాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. సోదాల్లో అరవింద్ రెడ్డి కార్యాలయంలో దొరికిన పత్రాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి ఏసీబీ ప్రశ్నిస్తోంది. ప్రధాన నిందితురాలు దేవికరాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. నిందితులు ఇచ్చే సమాచారం మేరకు మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నారు.

495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles