హుజూర్‌నగర్‌లో ఒంటిగంట వరకు 52.89 శాతం పోలింగ్

Mon,October 21, 2019 01:22 PM

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటలకు 31.34 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం 1 గంటలకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.


నియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. చింతలపాలెం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు జీకే గోక్లానీ పరిశీలించారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles