రాచకొండ పరిధిలో 25 చెరువుల్లో నిమజ్జనం

Wed,September 11, 2019 03:03 PM

25 ponds ready to Ganesh Immersion in Rachakonda Police commissionarate

హైదరాబాద్‌ : రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 11,900 విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ చేశామని సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. 25 చెరువుల్లో నిమజ్జనం ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 5 వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. 3 చోట్ల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. 5,660 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి 520 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు అని సీపీ తెలిపారు.

273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles