100 కిలోల గంజాయి స్వాధీనం

Sat,November 9, 2019 09:09 PM

పాల్వంచ : కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా పాల్వంచ పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు మండల పరిధిలోని ఇందిరా కాలనీలో తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో సోదా చేశారు. కారు డిక్కీలో 52 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ రూ.16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. కారులో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles