పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్.. కస్టమర్‌దే తప్పన్న‌ షియోమీ..!


Thu,November 21, 2019 03:49 PM

ముంబై: మొబైల్స్ తయారీదారు షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటిదే మరొక ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో నివాసం ఉండే ఈశ్వర్ చౌహాన్ గత అక్టోబర్ నెలలో ఫ్లిప్‌కార్ట్‌లో షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే నవంబర్ 2వ తేదీన అతని ఇంట్లో టేబుల్ మీద ఉంచిన‌ ఆ ఫోన్ దానంతట అదే అకస్మాత్తుగా పేలింది. ఈ క్రమంలో చౌహాన్ షియోమీ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా వారు ఆ ఫోన్‌ను పరిశీలించి కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలి ఉంటుందని చెప్పారు.

అయితే ఈశ్వర్ చౌహాన్ మాత్రం తాను ఫోన్‌ను టేబుల్ మీద పెట్టానని, అకస్మాత్తుగా అందులో నుంచి కాలిపోయిన వాసన వచ్చిందని, ఆ తరువాత వెంటనే పేలిందని, తాను ఫోన్‌ను కింద పడేయలేదని, కనీసం దానికి చార్జింగ్ కూడా పెట్టలేదని తెలిపాడు. అయితే షియోమీ అతని వాదనను పట్టించుకోలేదు. కానీ.. పేలిన ఆ ఫోన్‌కు బదులుగా ఇంకొక ఫోన్‌ను షియోమీ అతనికి ఇచ్చిందా, లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

12999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles