ఓపెన్ సేల్‌లో లభిస్తున్న రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్


Thu,November 7, 2019 12:12 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్‌ను గత సెప్టెంబర్ నెలలో రూ.6499 ప్రారంభ ధరకు లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్‌లోనే విక్రయించగా, ఇప్పుడు దీన్ని ఓపెన్ సేల్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు చెందిన అన్ని వేరియెంట్లను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 12, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫేస్ అన్‌లాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles