రూ.11,999కే ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైర్


Tue,September 17, 2019 04:06 PM

షియోమీ కంపెనీ.. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైర్‌ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 3 రకాల ఫిల్టర్లు ఉంటాయి. వాటిలో పాలిప్రొపిలీన్+యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్‌తో నీటిలో ఉండే కనిపించే వ్యర్థాలను తొలగించవచ్చు. అలాగే ఆర్‌వో ఫిల్టర్ సహాయంతో నీటిలో ఉండే లోహాలను, ఆర్గానిక్ వ్యర్థాలను తొలగించుకోవచ్చు. ఇక పోస్ట్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ సహాయంతో నీటికి ఉండే దుర్వాసన తొలగిపోతుంది. ట్యాంకులో ఉండే యూవీ లైట్ నీటిలో ఉండే 99.99 శాతం క్రిములను నాశనం చేస్తుంది. 7 లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకును ఈ ప్యూరిఫైర్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్యూరిఫైర్‌ను ఎంఐ హోమ్ యాప్‌కు కనెక్ట్ చేసుకుంటే నీటిలో ఉండే టీడీఎస్ స్థాయిలను రియల్‌టైంలో ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే 3 క్యాట్రిడ్జ్‌ల లైఫ్ కూడా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఫోన్‌కు నోటిఫికేషన్లు వస్తాయి. ఆ సమయంలో ఫిల్టర్లను కొత్తగా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్యూరిఫైర్ రూ.11,999 ధరకు వినియోగదారులకు ఈ నెల 29వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్స్‌లో వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ప్యూరిఫైర్‌కు చెందిన ఫిల్టర్లను మార్చాల్సి వస్తే వాటిని రూ.3997కు కొనుగోలు చేయవచ్చు.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles