అమెజాన్ కిండిల్‌కు పోటీగా ఎంఐ రీడర్‌ను విడుదల చేసిన షియోమీ


Tue,November 19, 2019 12:39 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ అమెజాన్‌కు చెందిన కిండిల్ బుక్ రీడర్‌కు పోటీగా ఎంఐ రీడర్ పేరిట ఓ నూతన ఈ-బుక్ రీడర్‌ను లాంచ్ చేసింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి ఎంఐ రీడర్‌ను షియోమీ విక్రయించనుంది. ఇక ఈ డివైస్‌లో 6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 24 రకాల బ్రైట్‌నెస్ ప్రీసెట్స్, మల్టిపుల్ ఫైల్ ఫార్మాట్లకు సపోర్ట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు సపోర్ట్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఓఎస్, యూఎస్‌బీ టైప్ సి, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. రూ.6100 ధరకు ఎంఐ రీడర్‌ను షియోమీ విక్రయించనుంది.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles