రూ.9,999కే ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 3.. విడుదల చేసిన షియోమీ..!


Wed,November 6, 2019 02:30 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 3ని ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఈ ప్యూరిఫైర్‌పై ఓలెడ్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్ క్వాలిటీ, ప్యూరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ప్యూరిఫైర్ సహాయంతో వినియోగదారులు తాము ఉంటున్న వాతావరణంలోని పీఎం 2.5 స్థాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. వైఫైకి ఈ డివైస్ కనెక్ట్ అవుతుంది.

ఈ ప్యూరిఫైర్‌లో స్లీప్, ఆటో, ఫేవరెట్, లో, మీడియం, హై లెవల్ మోడ్స్‌ను అందిస్తున్నారు. అలాగే ఎయిర్ క్వాలిటీని సూచించే ఇండికేటర్లను ప్యూరిఫైర్‌పై ఏర్పాటు చేశారు. గాలి నాణ్యంగా ఉంటే గ్రీన్ కలర్‌లో, కాలుష్యం ఉంటే ఆరెంజ్, రెడ్ కలర్లలో ఇండికేటర్లు వెలుగుతాయి. ఇక ఈ ప్యూరిఫైర్ గంటకు 380 క్యుబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. రూ.9,999 ధరకు ఈ ప్యూరిఫైర్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. రేపటి నుంచి ఈ డివైస్‌ను విక్రయించనున్నారు. కాగా ఈ ప్యూరిఫైర్‌కు అందించే ఫిల్టర్‌ను మారిస్తే రూ.2199 వరకు ఖర్చవుతుంది.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles