రూ.6499కే షియోమీ నూతన ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్


Sun,October 20, 2019 05:37 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2సి పేరిట ఓ నూతన ఎయిర్ ప్యూరిఫైర్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. దీన్ని ఎంఐ హోం యాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో గాలి నాణ్యతను పెంచుకోవచ్చు. అలాగే టెంపరేచర్, హ్యుమిడిటీ, ఫ్యాన్ స్ట్రెంగ్త్ కంట్రోల్ చేయవచ్చు. ఈ ప్యూరిఫైర్ గాలిలో ఉండే దాదాపు అన్ని రకాల సూక్ష్మ క్రిములను, ధూళి కణాలను దాదాపుగా 99.37 శాతం వరకు తొలగిస్తుంది. అందుకు గాను ఈ డివైస్‌లో 360 డిగ్రీల కోణంలో తిరిగే నూతన ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్యూరిఫైర్ ధర రూ.6499 ఉండగా దీన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్, హోం స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles