పుట్టగొడుగులు తింటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట..!


Sun,September 15, 2019 11:11 AM

తరచూ పుట్టగొడుగులను తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. 40 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సున్న 36,499 మంది పురుషులపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. వారిలో వారంలో రెండు సార్లు పుట్టగొడుగులు తినేవారికి తిననివారితో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 8 శాతం తక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు తేల్చారు. అలాగే వారంలో 3 లేదా 4 సార్లు పుట్టగొడుగులు తినేవారికి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు నిర్దారించారు. అందువల్ల వారంలో కనీసం 2, 3 సార్లు పుట్టగొడుగులను తింటే ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు. కాగా ఈ అధ్యయన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లోనూ ప్రచురించారు.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles