రూ.2,999 కే స్టఫ్ కూల్ వైర్‌లెస్ చార్జర్


Tue,September 10, 2019 01:48 PM

స్మార్ట్‌ఫోన్ యాక్ససరీలను తయారు చేసే స్టఫ్ కూల్.. డబ్ల్యూసీ510 పేరిట భారత్‌లో ఇవాళ ఓ నూతన వైర్‌లెస్ చార్జర్‌ను విడుదల చేసింది. ఈ చార్జర్‌కు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. క్యూఐ ప్రమాణాలు కలిగిన ఫోన్లను ఈ చార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. దీనికి టెంపరేచర్, షార్ట్ సర్క్యూట్, పవర్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్‌లను అందిస్తున్నారు. ఈ డివైస్‌పై ఉండే ఎల్‌ఈడీ ఇండికేటర్ సహాయంతో ఫోన్ చార్జింగ్ అవుతుందీ, లేనిదీ సులభంగా తెలుసుకోవచ్చు. ఐఫోన్ 8, 8 ప్లస్, Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్, X ఫోన్లతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్9, నోట్ 9 తదితర ఫోన్లను కూడా ఈ చార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ చార్జర్‌ను రూ.2,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles