ఎస్‌బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. డెబిట్ కార్డుతో ఈఎంఐ సౌకర్యం..!


Mon,October 7, 2019 01:35 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇకపై తమ డెబిట్ కార్డుతో ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు కేవలం క్రెడిట్ కార్డుల ద్వారానే వస్తువులను కొనుగోలు చేసి ఈఎంఐ పెట్టుకునే సదుపాయం ఎస్‌బీఐలో అందించారు. కానీ ఇకపై డెబిట్ కార్డులు ఉన్నవారు కూడా తమకు కావల్సిన వస్తువులను ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే సౌకర్యం అందిస్తున్నారు.

ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా వస్తువులను కొంటే 6 నుంచి 18 నెలల వరకు ఈఎంఐ పెట్టుకునే సదుపాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా 1500కు పైగా నగరాలు, పట్టాణల్లో ఉన్న 40వేలకు పైగా మర్చంట్లు, స్టోర్స్‌లో ఎస్‌బీఐ వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక కస్టమర్లకు సంబంధించిన ఆర్థిక స్థితి, క్రెడిట్ హిస్టరీని బట్టి డెబిట్ కార్డు ఈఎంఐ లిమిట్ అందివ్వనున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు 567676 నంబర్‌కు DCEMI అని తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపిస్తే తాము ఈ సదుపాయానికి అర్హులవుతారో, కారో తెలుసుకోవచ్చు. అలాగే తమకు కేటాయించబడిన క్రెడిట్ లిమిట్ వివరాలు కూడా తెలుస్తాయి.

12832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles