శాంసంగ్ యానివర్సరీ సేల్.. భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్‌ఫోన్లు..!


Mon,October 7, 2019 02:57 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన ఆన్‌లైన్ స్టోర్‌లో యానివర్సరీ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఇవాళే ప్రారంభం కాగా అక్టోబర్ 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లతోపాటు అనేక ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. సేల్‌లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ట్రాన్సాక్షన్లతో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక గెలాక్సీ ఎస్9, నోట్9 ఫోన్లపై సేల్‌లో భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ యానివర్సరీ సేల్‌లో గెలాక్సీ ఎస్9 (64జీబీ) ఫోన్‌ను రూ.29,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 128 జీబీ మోడల్ ధర రూ.49,900గా ఉంది. గెలాక్సీ నోట్ 9ను రూ.42,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎం30ఎస్‌ను రూ.13,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. అదేవిధంగా పలు టీవీలపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇక హర్మాన్ కార్డన్ ఆడియో ఉత్పత్తులపై 50 శాతం వరకు, జేబీఎల్ ఆడియో ఉత్పత్తులపై 60 శాతం వరకు, మెమొరీ, స్టోరేజ్ డివైసెస్‌పై 40 నుంచి 60 శాతం వరకు శాంసంగ్ తగ్గింపు ధరలను అందిస్తున్నది.

6859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles