6000ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్


Wed,September 18, 2019 12:56 PM

గెలాక్సీ ఎం30ఎస్ పేరిట శాంసంగ్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఓపాల్ బ్లాక్, సఫైర్ బ్లూ, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా దీనికి చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.13,999 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.16,999 ధరకు అందిస్తున్నారు. అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ షాప్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో... 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయల్ సిమ్, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles