రూ.1299కే రియల్‌మి 10000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్


Sun,September 15, 2019 12:28 PM

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం రియల్‌మి.. 10000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న ఓ నూతన పవర్‌బ్యాంకును భారత్‌లో విడుదల చేసింది. దీనికి 18 వాట్ల టూ-వే ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. యూఎస్‌బీ టైప్ సి, టైప్ ఎ పోర్టులను కూడా ఇచ్చారు. దీంతో 2 డివైస్‌లను ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఓవర్ పవర్, షార్ట్ సర్క్యూట్, పవర్ ప్రొటెక్షన్ ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. 5.36 గంటలలో ఈ పవర్ బ్యాంకు ఫుల్ చార్జి అవుతుంది. 18 వాట్ల చార్జర్‌తో అయితే కేవలం 3.28 గంటల్లోనే ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ పవర్ బ్యాంకు రూ.1299 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నది.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles