దీపావళి ఆఫర్.. రూ.101 చెల్లించి వివో ఫోన్ కొనవచ్చు..!


Sat,October 19, 2019 01:31 PM

స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో దీపావళి సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.101 డౌన్ పేమెంట్ మాత్రమే చెల్లించి వినియోగదారులు నూతన వివో ఫోన్‌ను ఈఎంఐ విధానంలో కొనుగోలు చేయవచ్చు. కేవలం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఫోన్లను కొనే వారికి మాత్రమే ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఇక హెచ్‌డీబీ ఫైనాన్స్‌తో వివో ఫోన్లను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. నెలకు కేవలం రూ.926 ఈఎంఐతో వివో ఫోన్లను కొనవచ్చు. అలాగే పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.1,999 విలువైన బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ను వివో వి17 ప్రొ, ఎస్1 ఫోన్ల కొనుగోలుపై పొందవచ్చు. అదేవిధంగా వివో వి17ప్రొ, వి15ప్రొ, జడ్1ఎక్స్ (8జీబీ ర్యామ్ వేరియెంట్), వి15, ఎస్1, వై17, వై15, వై12 ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

12078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles