ఒప్పో ఎ9 2020 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,September 12, 2019 01:04 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎ9 2020 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,990గా ఉంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

ఒప్పో ఎ9 2020 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles