వన్‌ప్లస్ 7టి ప్రొ విక్రయాలు షురూ..!


Sat,October 12, 2019 07:32 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 7టి ప్రొను తాజాగా భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను శనివారం నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయాలను ప్రారంభించారు. ఈ ఫోన్ రూ.53,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. దీని కొనుగోలుపై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.3వేలు, ఐసీఐసీఐ కార్డులతో రూ.1750 వరకు ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌టెల్ వినియోగదారులు 3 నెలల పాటు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లను ఉచితంగా పొందవచ్చు.

వన్‌ప్లస్ 7టి ప్రొ ఫోన్‌లో 6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 48, 8, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles