రూ.13,999కే మైక్రోమ్యాక్స్ 32 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ


Wed,July 10, 2019 10:50 AM

దేశీయ మొబైల్స్ త‌యారీ సంస్థ మైక్రోమ్యాక్స్ భార‌త్‌లో నూత‌న ఆండ్రాయిడ్ టీవీ మోడ‌ల్స్‌ను తాజాగా విడుద‌ల చేసింది. వీటిని గూగుల్ స‌ర్టిఫై చేయ‌డం విశేషం. కాగా ఈ టీవీలు 32 ఇంచుల డిస్‌ప్లే మొద‌లుకొని 43 ఇంచుల డిస్‌ప్లే వ‌ర‌కు ల‌భిస్తున్నాయి. 32 ఇంచుల మోడ‌ల్ టీవీ ధ‌ర రూ.13,999 ఉండ‌గా వీటిని రేప‌టి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు. కాగా ఈ టీవీల్లో గూగుల్ ప్లే స్టోర్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచ‌ర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్‌ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు.

2402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles