భారత్‌లో సెప్టెంబర్ 27న కొత్త ఐఫోన్ల విడుదల.. ధరలివే..!


Wed,September 11, 2019 11:42 AM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లను నిన్న విడుదల చేసిన విషయం విదితమే. కాలిఫోర్నియాలోని కుపర్టినో ఆపిల్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఆ ఫోన్లను లాంచ్ చేశారు. కాగా భారత్‌లో ఈ ఫోన్లు సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా... వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఫోన్ 11 64జీబీ - రూ.64,900
ఐఫోన్ 11 128జీబీ - రూ.69,900
ఐఫోన్ 11 256జీబీ - రూ.79,900

ఐఫోన్ 11ప్రొ 64జీబీ - రూ.99,900
ఐఫోన్ 11ప్రొ 256జీబీ - రూ.1,13,900
ఐఫోన్ 11ప్రొ 512జీబీ - రూ.1,31,900

ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 64జీబీ - రూ.1,09,900
ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 256జీబీ - రూ.1,23,900
ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 512జీబీ - రూ.1,41,900

కాగా ఈ నూతన ఐఫోన్లు ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ నెల 27వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles