భయం గొల్పుతున్న ఐఫోన్ 11 కెమెరాలు..?


Sat,September 14, 2019 01:51 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తాజాగా తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌లను విడుదల చేసిన విషయం విదితమే. మరికొద్ది రోజుల్లో ఈ ఫోన్లు వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అయితే ఈ ఫోన్ల వెనుక భాగంలో ఉన్న కెమెరాల ఆకృతి, డిజైన్ పట్ల పలువురు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. ఐఫోన్ 11 ఫోన్ల వెనుక భాగంలో ఉన్న కెమెరాలు కొందరిలో ట్రైపోఫోబియాను కలిగిస్తున్నాయి.


ట్రైపోఫోబియా అంటే.. గణిత శాస్త్రంలోని రేఖాగణితానికి చెందిన పలు ఆకృతులు, కూర్పులు.. ఇంకా చెప్పాలంటే తేనెతెట్టెను, తామరపువ్వు విత్తనాలను పోలిన చిన్న చిన్న రంధ్రాలను, చతురస్రాకారాలను చూసినప్పుడు కలిగే భయం అన్నమాట. ఈ క్రమంలోనే ఈ భయం ఉన్న వారు ఐఫోన్ 11 ఫోన్ల వెనుక కెమెరాలను చూసినప్పుడు తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన భయానికి గురై వారికి ఆ సమయంలో వాంతికి వచ్చినట్లు, తల తిరిగినట్లు అనిపిస్తుంది.

కొందరికి తేళ్లు, పాములు, బల్లులు, బొద్దింకలను చూస్తే ఒళ్లు ఎలా జలదరిస్తుందో.. ఆ రంధ్రాల్లాంటి ఆకృతులను చూసినప్పుడు కూడా పైన చెప్పిన వారికి ఒళ్లు జలదరిస్తుంది. అందుకనే ట్రైపోఫోబియా ఉన్నవాళ్లు ఐఫోన్ 11 బ్యాక్ కెమెరాలను చూడకపోవడమే మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఐఫోన్ 11 ఫోన్లను మార్ఫింగ్ చేసి సెటైర్లు వేస్తున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




10682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles