టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్..!


Wed,November 13, 2019 05:37 PM

ప్రముఖ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ త్వరలో రీల్స్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో ఈ ఫీచర్‌ను అందివ్వనున్నారు. ఈ ఫీచర్ వల్ల టిక్‌టాక్ తరహాలో యూజర్లు వీడియోలను క్రియేట్ చేసి తమ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలోకి వాటిని అప్‌లోడ్ చేయవచ్చు. ఈ క్రమంలో వాటిని యూజర్లకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ లేదా పబ్లిక్ వీక్షించేందుకు వీలు కలుగుతుంది. ఇక వీడియోల నిడివిని 15 సెకండ్లుగా నిర్ణయించారు. యూజర్లకు తమకు నచ్చిన మ్యూజిక్ లేదా పాటలను సదరు వీడియోలకు యాడ్ చేసుకుని, పలు రకాల ఫిల్టర్లను అప్లై చేసేందుకు గాను రీల్స్ ఫీచర్‌లో ఎడిటింగ్ టూల్స్‌ను కూడా అందివ్వనున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles