రూ.8,999కే ఇన్ఫినిక్స్ ఎస్5 స్మార్ట్‌ఫోన్


Sun,October 20, 2019 11:52 AM

మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ ఎస్5ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి నుంచి లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌లో... 6.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles