రూ.3,999 కే హైఫ్యూచర్ నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్


Wed,December 11, 2019 11:03 AM

హైఫ్యూచర్ కంపెనీ ఓలింబడ్స్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇవి బ్లూటూత్ 5.0 ద్వారా ఫోన్లకు కనెక్ట్ అవుతాయి. 35 అడుగుల రేంజ్‌లోనూ ఇవి పనిచేస్తాయి. వీటికి సుపీరియర్ బేస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల వీటి నుంచి వెలువడే సౌండ్ అవుట్‌పుట్ అద్భుతంగా ఉంటుంది. వీటికి వాటర్‌ప్రూఫ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఇవి 20 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. ఇక ఈ ఇయర్‌బడ్స్‌ను వినియోగదారులు రూ.3,999 ధరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles