గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ నుంచి ఇకపై ఫోన్ల‌కు మరింత రక్షణ..!


Thu,November 7, 2019 03:29 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ఇకపై తన ప్లేస్టోర్‌లో ఉండే యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు మరింత రక్షణనివ్వనుంది. అందుకుగాను ఆ సంస్థ గూగుల్ యాప్ డిఫెన్స్ అలియన్స్ పేరిట ఓ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. ఇందులో గూగుల్‌తోపాటు ఐటీ సెక్యూరిటీ సంస్థలైన ఎసెట్, లుకౌట్, జింపేరియంలు భాగస్వాములుగా ఉంటాయి. ఈ క్రమంలో గూగుల్ యాప్ డిఫెన్స్ అలియన్స్ ప్లే స్టోర్‌లో ఉండే యాప్స్‌తోపాటు డెవలపర్లు ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేయాలనుకునే యాప్స్‌ను కూడా ముందుగానే స్కాన్ చేస్తారు. వాటిల్లో ఏవైనా మాల్‌వేర్, ఇతర వైరస్‌లు ఉంటే వెంటనే తొలగిస్తారు. ఈ క్రమంలో ప్లే స్టోర్ యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు మరింత రక్షణ లభిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా వ్యాప్తి చెందే వైరస్‌ల నుంచి యూజర్ల ఫోన్లకు సెక్యూరిటీ లభిస్తుంది.

5533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles