చైనాలో ఇక ఫోన్ వాడాలంటే.. ముఖం స్కాన్ చేయాల్సిందే..!


Mon,December 2, 2019 12:10 PM

బీజింగ్: చైనా ప్రభుత్వం ఫోన్లను ఉపయోగించే వినియోగదారులకు మరింత సైబర్ భద్రత కల్పించేందుకు ఓ నూతన విధానాన్ని తాజాగా అమలులోకి తెచ్చింది. ఇకపై అక్కడ కొత్తగా ఫోన్ కొనేవారు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఫోన్లను ఉపయోగిస్తున్నవారు తమ ముఖాన్ని ముందుగా స్కాన్ చేయాలి. ఈ క్రమంలో ఫోన్ల వినియోగదారులు తమకు సమీపంలో ఉండే ఆఫ్‌లైన్ ఔట్‌లెట్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కొత్త విధానం ఆదివారం నుంచే అక్కడ అమలులోకి వచ్చింది. గత సెప్టెంబర్ నెలలోనే ఈ నిబంధనపై చైనా ప్రభుత్వం ప్రకటన చేయగా... ప్రస్తుతం దాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ అంశంపై అక్కడి ఫోన్ల వినియోగదారుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నిబంధన వల్ల వినియోగదారుల బయోమెట్రిక్ డేటాకు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇంటర్నెట్ ప్రపంచంలో సురక్షితంగా ఉండాలంటే ఈ నిబంధన తప్పనిసరి అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles