త్వరలో నోకియా స్మార్ట్‌టీవీలు.. లాంచ్ చేయనున్న ఫ్లిప్‌కార్ట్..!


Wed,November 6, 2019 03:45 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియాతో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి లాంచ్ చేయ‌నుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది. ఇప్పటికే భారత్‌లో అనేక కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలు వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. ఇకపై నోకియా స్మార్ట్‌టీవీలు కూడా లభ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ నోకియా బ్రాండ్ పేరిట సదరు స్మార్ట్‌టీవీలను విక్రయించనుంది.

ఫ్లిప్‌కార్ట్ తయారు చేయనున్న నోకియా స్మార్ట్‌టీవీల్లో జేబీఎల్ కంపెనీకి చెందిన సౌండ్ ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ మేరకు జేబీఎల్ మాతృసంస్థ హర్మాన్‌తో ఫ్లిప్‌కార్ట్, నోకియాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో హై క్వాలిటీ ఆడియో ఎక్విప్‌మెంట్ కలిగిన నోకియా స్మార్ట్‌టీవీలు త్వరలో భారత్‌లోని వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అయితే ఈ టీవీలను ఎప్పుడు లాంచ్ చేయ‌నున్నార‌నే వివ‌రాల‌ను ఆ కంపెనీలు వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..!

2487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles