ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్లో మొబైల్స్ బొనాంజా సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ నెల 18వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎ50, రెడ్మీ కె20, కె20 ప్రొ, పోకో ఎఫ్1, రియల్‌మి 5, గూగుల్ పిక్సల్ 3ఎ, హానర్ 20 స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 7, 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లపై కూడా రాయితీలను అందిస్తున్నారు.