ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో మరోసారి దీపావళి సేల్స్..!


Sat,October 19, 2019 04:26 PM

ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఇటీవలే ప్రత్యేక సేల్స్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ నిర్వహించగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌ను నిర్వహించింది. అయితే ఈ రెండు సంస్థలు మరోసారి ప్రత్యేకమైన సేల్స్‌ను నిర్వహించనున్నాయి. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుండగా, అదే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ కూడా మరోసారి బిగ్ దివాలీ సేల్‌ను నిర్వహించనుంది. ఇక ఈ సేల్స్‌లో అనేక ఆఫర్లను వినియోగదారులకు అందివ్వనున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో షియోమీ రెడ్‌మీ, వివో ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలపై ఆఫర్లను అందివ్వనుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్, శాంసంగ్, నోకియా ఫోన్లు, అమెజాన్ ఎకో ప్రొడక్ట్స్, ఫైర్ టీవీ స్టిక్, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లను అందివ్వనున్నారు.

4157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles