ఐఫోన్ 11 ఫోన్లకు స్మార్ట్ బ్యాటరీ కేస్‌లను లాంచ్ చేసిన ఆపిల్


Thu,November 21, 2019 03:32 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ 11 ఫోన్లకు గాను స్మార్ట్ బ్యాటరీ కేస్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఈ కేస్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఆయా ఫోన్ల బ్యాటరీ బ్యాకప్ 50 శాతం పెరుగుతుందని ఆపిల్ తెలిపింది. కాగా ఈ స్మార్ట్ కేస్‌లు సిలికాన్ సాఫ్ట్ టచ్ ఫినిషింగ్‌ను కలిగి ఉన్నందున ఫోన్లకు గ్రిప్ బాగా ఉంటుంది. అలాగే ఈ కేస్‌లను ఫోన్‌కు వేసినప్పటికీ ఫోన్‌పై ఉండే బటన్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్‌కేస్‌లు ఆపిల్ సైట్‌లో వినియోగదారులకు రూ.9,270 ధరకు లభిస్తున్నాయి.

3409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles