ఆపిల్ 7వ జనరేషన్ ఐప్యాడ్ (2019) విక్రయాలు షురూ..!


Sun,October 13, 2019 12:32 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ ఇటీవలే 7వ జనరేషన్ ఐప్యాడ్ (2019)ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఐప్యాడ్‌కు గాను భారత్‌లో విక్రయాలను ప్రారంభించారు. ఈ ఐప్యాడ్‌కు చెందిన వైఫై వేరియెంట్ 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,900 ఉండగా, 128 జీబీ మోడల్ ధర రూ.37,900గా ఉంది. అలాగే వైఫై+సెల్యులార్ వేరియెంట్ 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.40,900 ఉండగా, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.48,900 గా ఉంది. ఇక ఈ ఐప్యాడ్‌లో 10.2 ఇంచుల డిస్‌ప్లే, ఆపిల్ ఎ10 ఫ్యుషన్ ప్రాసెసర్, 32/128 జీబీ స్టోరేజ్, ఐఓఎస్ 13, 8, 1.2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్టీఈ (ఆప్షనల్), బ్లూటూత్ 4.2, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles