ఈ నెల 15, 16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్


Thu,July 11, 2019 08:41 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఈ నెల 15, 16 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, అప్లయన్సెస్‌పై భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లను అందివ్వనుంది. సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20, ఎల్‌జీ డబ్ల్యూ10, హానర్ 10 లైట్, షియోమీ ఎంఐ ఎ2 ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. సేల్‌లో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులతో ఉత్పుత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

3500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles