అమెజాన్ బంపర్ ఆఫర్.. 13 నుంచి మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..!


Mon,October 7, 2019 12:00 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ నుంచి మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగ్గా, 13 నుంచి 17వ తేదీ వరకు మరో దఫా ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. అయితే ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ పేరిట ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందివ్వనున్నారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌లో ఐసీఐసీఐ కార్డులతో ఐటమ్స్‌ను కొన్నవారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. దీంతోపాటు వన్‌ప్లస్, షియోమీ, ఆపిల్, శాంసంగ్ కంపెనీలకు చెందిన పలు ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు. అలాగే అమెజాన్ తన ఎకో డివైస్‌లను కూడా తగ్గింపు ధరలకే అందివ్వనుంది. కాగా ఈ సేల్ ఒక్క రోజు ముందుగానే.. అంటే.. అక్టోబర్ 12 తేదీన మధ్యాహ్నం12 గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది.

3096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles