టెక్ అప్‌డేట్..యూట్యూబ్ కొత్త రూల్స్!


Wed,October 9, 2019 07:52 AM

టెక్నాలజీ నిరంతరం అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. మారినప్పుడల్లా..కొత్త కొత్త ఫీచర్స్, సెట్టింగ్స్, రూల్స్ వస్తూనే ఉంటాయి. అలాగే యూట్యూబ్ కూడా కొన్ని మార్పులు చేసింది. యూట్యూబ్ వీడియోలకు ఉండే వ్యూస్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల ఓ ఇండియన్ ర్యాప్ సింగర్ వీడియో కేవలం ఒక్క రోజులోనే 7.5 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ సంఖ్యను మ్యానిపులేట్ చేశారని, తప్పుడు మార్గాల్లో పెంచారని, తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన యూట్యూబ్ నిర్వాహకులు ఇకపై పెట్టే వీడియోలకు కొన్ని నిబంధనలు విధించారు. ఇకపై అప్‌లోడ్ చేసే వీడియోల్లోని యాడ్స్ ఎంతమంది చూశారని కాకుండా.. ఇతర పద్ధతుల ఆధారంగా ఎంతమంది చూశారన్న లెక్కను గణిస్తారంట. అలాగే.. 24 గంటల్లో రికార్డు వ్యూస్ అన్న అంశంపైనా మార్పులు చేయనున్నారని తెలిపారు. కాగా.. వీడియో డైరెక్ట్‌గా షేర్ చేసుకుని, సెర్చ్ చేసి వీడియోలు చూస్తుండం వంటి సహజ సిద్ధమైన ప్రక్రియల ఆధారంగా ఎంతమంది చూశారన్న విషయం కౌంటింగ్ నిర్వహిస్తామని యూట్యూబ్ కంపెనీ బ్లాగ్‌లో తెలిపింది.

5983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles