4 నిమిషాల్లోనే 64వేల రియల్‌మి ఎక్స్‌టీ ఫోన్ల అమ్మకం..!


Mon,September 16, 2019 04:33 PM

రియల్‌మి ఇటీవల విడుదల చేసిన రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తించిన విషయం విదితమే. అందులో ఉన్న ఫీచర్లకు యూజర్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ ఫోన్‌ను యూజర్లు ఇవాళ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. మొదటి సేల్‌లో రియల్‌మి ఈ ఫోన్‌కు గాను మొత్తం 64వేల యూనిట్లను అందుబాటులో ఉంచగా.. కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ఆ ఫోన్లన్నీ అమ్ముడయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌కు గాను తదుపరి సేల్‌ను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు రియల్‌మి తెలిపింది. ఈ మేరకు రియల్‌మి ట్వీట్ చేసింది.

కాగా రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతోపాటు 6.4 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్ తదితర ఆకట్టుకునే ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. అందుకనే ఈ ఫోన్ పట్ల వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపించారు.

2402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles