‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన తమిళ అందం నివేదా పేతురాజ్. వరుస అవకాశాలతో కథానాయికగా నిలదొక్కుకుంది. తెలుగు, తమిళం ఉభయ భాషా చిత్రాల్లోనూ సత్తా చాటుతున్నది. హీరోయిన్గా రాణిస్తూనే.. పలు సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే… ఓకే చెబుతున్నది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటున్న నివేదా ఫార్ములా వన్ రేసర్ కూడా! ఈ డస్కీ బ్యూటీ పంచుకున్న కబుర్లు ఇవి..
నాకు ఫార్ములా వన్ రేస్ అంటే చాలా ఇష్టం. అందులో శిక్షణ కూడా తీసుకున్నా. రేసింగ్‌లో ఫస్ట్ లెవల్‌ను పూర్తిచేశాను. రేసింగ్ జోన్‌కు వెళ్లగానే సినిమాను పూర్తిగా మర్చిపోతాను. రేస్‌లో దూసుకుపోతుంటే.. ఆ థ్రిల్ వేరు!
కెరీర్ తొలినాళ్లలో ప్రభుదేవాతో ఓ తమిళ చిత్రం చేస్తున్నాను. అప్పుడు ఆయన ‘తమిళంలో ఎందుకు చేస్తున్నావ్? టాలీవుడ్‌కు వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. తెలుగు సినిమాలు చేయి. గ్లామర్ హీరోయిన్గా మంచిపేరు తెచ్చుకో! మంచి రెమ్యునరేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చేద్దువు’ అని సలహా ఇచ్చారు. నేను అదే మార్గంలో ప్రయాణిస్తున్నాను. అయితే గ్లామర్ పాత్ర అనగానే అందరూ స్కిన్ షో అనుకుంటారు. కానీ, ఆ అభిప్రాయం మారాలి. మనకు కలకాలం గుర్తుండిపోయేదే నిజమైన గ్లామర్ పాత్ర. అర్ధనగ్నంగా కనిపించడమో, మరోలా పోజులివ్వడమో గ్లామర్ అనిపించుకోదు.
గ్లామర్ పాత్రలు చేస్తూనే, మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయాలని ఉంది. గ్లామర్ పాత్రలు చేయడం సరదాగా ఉంటుంది. అన్ని రకాల పాత్రలు పోషించినప్పుడే గుర్తింపు వస్తుంది. నావరకైతే.. వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉంది.
నా ఫేస్ చూడగానే చాలామంది ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నావని అడుగుతుంటారు. నేను చాలా జోవియల్. ఆ మాట ఎంత చెప్పినా నమ్మరు. దానికి తగ్గట్టు నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా పాత్రలు సీరియస్‌గా ఉండేవే! వాటి ప్రభావంతోనే ‘నేను సీరియస్’ అని ఫిక్సవుతుంటారు చాలామంది. కాసేపు మాట్లాడిన తర్వాత నేను చాలా సరదా మనిషినని వాళ్లూ ఒప్పుకొంటారనుకోండి.
ఏ సినిమా అయినా కథ నచ్చితేనే ఓకే చెప్తాను. ఆ తర్వాత నా పాత్ర నచ్చాలి. రెండిట్లో ఏది నచ్చకపోయినా రిజెక్ట్ చేస్తాను. అయితే, నాకు నచ్చింది కదా అని సినిమా హిట్టయిపోతుందని పగటి కలలు కనను. మంచి సినిమా చేస్తున్నాను, నచ్చిన పాత్ర పోషిస్తున్నానని భావిస్తాను. ఫలితం అనుకూలంగా వస్తే హ్యాపీ! ఆడకపోతే మాత్రం అసహనంగా ఉంటుంది. అయితే నా నటనకు మంచి మార్కులు పడితే కాస్త ఊరట చెందుతా!
నేను తమిళనాడులో పుట్టాను. దుబాయ్‌లో పెరిగాను. నాన్నది తమిళనాడు. అమ్మది ఆంధ్రా. మిస్ ఇండియా దుబాయ్ పోటీలో గెలిచిన వెంటనే నాకు సినిమా ఆఫర్ వచ్చింది. తమిళంలో నాలుగు సినిమాల్లో నటించాను, తెలుగులో ‘మెంటల్ మది’లో నా తొలి సినిమా. ‘అల వైకుంఠపురుములో..’ మంచి గుర్తింపు ఇచ్చింది. రెడ్, పాగల్ తదితర సినిమాలు నా కెరీర్‌కు బూస్ట్ ఇచ్చాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రం సినిమా వాళ్లకు అక్షరాలా వర్తిస్తుంది. లైమ్ లైట్లో ఉన్నప్పుడే లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. అందుకు సినిమాలతోపాటు ఆల్నరేటివ్ ఆప్షన్ ఉండటం అత్యావశ్యకం. చాలామంది నటీనటులు సినిమాలే లోకంగా ఉంటారు. కరోనా పాండమిక్ టైమ్‌లో అవకాశాల్లేక చాలామంది నటులు కుంగుబాటుకు గురయ్యారు. అలాంటి పరిస్థితి
రావొద్దంటే.. జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.