నిచ్చెలి జెన్నిఫర్‌


Sun,December 1, 2019 03:35 AM

RRR"title="RRR"/
మొన్నొక పేరు వినిపించింది.. నిన్నొక పేరు వినిపించింది.. ఇప్పుడు కొత్త పేరు.. కానీ ఈసారి కన్ఫామ్‌. అధికారికంగానే చిత్ర యూనిటే చెప్పేసింది. హాలీవుడ్‌కే పరిచయం అయిన ‘ఒలివియ మోరిస్‌' దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న #ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జెన్నిఫర్‌గా అలరించనున్నది. ఈ నేపథ్యంలో ఆమె గురించిన కొన్ని విషయాలు.

ఒలివియ హాలీవుడ్‌ టీవీ నటి.

తెలుగులో నటించడం ఇదే మొదటిసారి. అదికూడా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో జెన్నిఫర్‌ పాత్రలో, పెద్ద స్టార్లతో కనిపించనున్నది.
-ఇన్‌స్టాగ్రామ్‌లో వందల్లో ఉన్న ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య రాజమౌళి ప్రకటన తర్వాత లక్షకు పెరిగింది.
-ఒలివియ ఊహల్లో ఉన్న క్రియేటివిటీని రోజులో ఒక్కసారైనా నిజజీవితంలో అమలు చేస్తుందట.
-ఒలివియకు చిన్నప్పటి నుంచి డ్రామా అంటే ఇష్టం. కెరీర్‌ ప్రారంభించింది డ్రామా తోనే. నానమ్మ దగ్గర కూర్చొని నాటకం నేర్చుకొనేది.
-స్ఫూర్తినిచ్చే విషయాలకోసం తరచూ వెతుకుతుంటుంది ఒలివియా మోరిస్‌.
-డామా స్కూల్‌లో చేరిన ఒలివియ కొన్ని రోజుల తర్వాత డ్రామా టీచర్‌గా మారింది. ఇటీవల ఒలివియ సంగీతం, నాటకం నుంచి డిగ్రీ పొందింది.
RRR1"title="RRR"/

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో

-ఎన్టీఆర్‌కు జోడీ ఎవరని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తుండగా దర్శకుడు ఒలివియ పేరును ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది గూగుల్‌లో ఈమె గురించి వెతకడం మొదలుపెట్టారు.
-మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌ మెయిన్‌ విలన్స్‌గా నటిస్తున్నారు.
RRR2"title="RRR"/

17 ఏండ్లకే టీవీ షోలో కనిపించింది

-2018లో ఇంగ్లిష్‌ రియాలిటీ టీవీ మినీ-సిరీస్‌లో ‘A’-టీవీ రీడర్‌గా చేసింది.
-చిన్న పిల్లలతో ఎక్కువ గడుపుతుంది. డ్రామా టీచర్‌గా ఆమె పిల్లల్లో క్రియేటివిటీని పెంచడానికి ఎక్కువ దృష్టి సారిస్తుంది. అట్లాగే క్రియేటివిటీని ఎవరైనా ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేస్తే వాళ్లకు మద్దతుగా ఉంటుంది.
-అన్నింటికంటే ముందు ఒలివియ మంచి డాన్సర్‌. మోడల్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసింది.
RRR3"title="RRR"/

1996లో లండన్‌లో జన్మించింది.

-రాయల్‌ వెల్ష్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్రామాలో డిగ్రీ చేసింది.
-సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
RRR"title="RRR4"/

373
Tags

More News

VIRAL NEWS